స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘హ్యాపీ బర్త్ డే’. ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు రితేష్ రానా మీడియాతో మాట్లాడుతూ.. “ప్రస్తుతం మన సమాజంలో గన్స్ లీగల్ కాదు. అందరి దగ్గర గన్స్ వుండటం కష్టం. అందుకే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేద్దామనే ఆలోచనతో ఈ సినిమా చేశాము. సర్రియల్ కామెడీ అనే జోనర్ వుంది. కానీ తెలుగులో ఇప్పటి వరకూ రాలేదు. కథ మొత్తం లాజికల్‌గానే వుంటుంది. అయితే కథ జరిగే ప్రపంచం ఊహజనితంగా వుంటుంది. ట్రైలర్ ఆసక్తికరంగా వుండాలి, కథ అర్ధం కాకూడదనే ఉద్దేశంతోనే ట్రైలర్ కట్ చేశాం. ఈ కథ ఎలాంటి ప్రపంచంలో జరుగుతుందనేది చెప్పి, పాత్రలని పరిచయం చేశాం. కథ ఏమిటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో దాదాపు అన్ని రకాల గన్స్ వాడాం. లావణ్య త్రిపాఠి ఇలాంటి సినిమా చేయలేదు. ఒక టీవీ షోలో తనని చూసి ఈ క్యారెక్టర్ రాశాను. ఈ సినిమా థియేటర్ కోసమే తీశాం. 300 వందల మంది కలిసి నవ్వుకోవడంలో ఓ కిక్ వుంటుంది. తర్వాత ఓటీటీలో కూడా వర్కవుట్ అవుతుంది”అని అన్నారు.
Director Ritesh Rana Interview about ‘Happy Birthday’