Monday, December 23, 2024

దర్శకుడు సాగర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు సాగర్ అలియాస్ విద్యాసాగర్ రెడ్డి కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 1993లో నరేష్-విజయశాంతి నటించిన రాకాసిలోయ మూవీకి దర్శకత్వం వహించి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కృష్ణ-సౌందర్యతో నటించిన అమ్మదొంగా సినిమాకు దర్శకత్వం వహించారు. స్టూవర్ట్‌పురం దొంగలు, అమ్మనా కోడలా లాంటి సినిమాలకు దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకన్నాడు. ఆయన దర్శకత్వం వహించిన రామసక్కనోడు మూవీకి మూడు నంది పురస్కారాలు వచ్చాయి. తెలుసు సినిమాద ర్శకుల సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా సేవలందించారు. సాగర్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News