Friday, December 20, 2024

విజువల్ ఫీస్ట్‌లా ‘బ్రో’

- Advertisement -
- Advertisement -

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ’బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు సముద్రఖని మీడియాతో మాట్లాడుతూ “ఈ కథని అన్ని భాషలకు చేరువ చేయాలి. 12 భాషల్లో చేయాలని సన్నాహాలు చేస్తున్నాము.

వినోదయ సిత్తం సినిమా చేయకముందు, తర్వాత ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. ఈ మూవీ చేశాక జీవితంలో సగం సాధించామనే భావన కలిగింది. ఇక ఇప్పుడు బ్రో సినిమా చేశాక ఇంతకంటే సాధించడానికి ఏంలేదు, ఇప్పటినుంచి జీవితంలో వచ్చేదంతా బోనస్ అనిపిస్తుంది. త్రివిక్రమ్ అన్నయ్య సహకారంతో తెలుగులో ఈ సినిమా చేయగలిగాను.. ఇక పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో కొన్ని మార్పులతో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ చెప్పారు. పవన్‌కళ్యాణ్‌కి కథ నచ్చడంతో వెంటనే సినిమా పని మొదలైంది. కాలమే త్రివిక్రమ్‌ని, పవన్‌కళ్యాణ్ ని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చింది. మాతృకలోని ఆత్మని తీసుకొని పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌కి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశాం. మాతృక కంటే గొప్పగా ఉంటుంది బ్రో సినిమా. ఇది విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. ఇప్పటిదాకా నేను చేసిన 15 సినిమాల్లో ఇదే నా బెస్ట్ మూవీ”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News