- Advertisement -
తిరుమల: ‘కలర్ ఫొటో’ సినిమా దర్శకుడు సందీప్ ఇంటివాడయ్యాడు. తిరుమలలో హీరోయిన్ చాందినీరావును సందీప్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడకకు హీరో సుహాస్, వైవా హర్ష తదితరలు హాజరయ్యారు. దర్శకుడు సందీప్ తెరకెక్కించిన కలర్ ఫొటో సినిమాలో చాందినీ రావు నటించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇరు వైపుల కుటుంబాలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. షార్ట్ ఫిల్మ్‌లతో సందీప్ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. కలర్ ఫొటోతో దర్శకుడిగా మారాడు. టాలీవుడ్‌లో కలర్ ఫొటో సినిమా హిట్ కావడంతో ఆయను మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో జాతీయ స్థాయిలో పురస్కారం రావడంతో ఆయన పేరు ఒక్కసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. రాజీవ్ కనకాల-సుమ దంపతుల తనయుడు రోషన్‌తో మోగ్లీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
- Advertisement -