Sunday, December 22, 2024

“ధూమ్ ” దర్శకుడు సంజయ్ గధ్వి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబై : బాలీవుడ్ దర్శకుడు , ధూమ్, ధూమ్ 2 చిత్రాల దర్శకుడుగా ప్రేక్షకుల్లో విశేష ఆదరాభిమానాలు చూరగొన్న సంజయ్ గధ్వి ఆదివారం గుండెపోటుతో మరణించారు. హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధూమ్‌తో సంజయ్‌కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. మరో మూడు రోజుల్లో 57 వ ఏట అడుగుపెట్టనుండగా ఈ విషాదం జరగడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సంజయ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఇటీవల స్నేహితులతో కలిసి మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూశారని చెబుతున్నారు. మేరే యార్ కి షాదీ హై, కిడ్నాప్ మూవీలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. 2020లో ఆజాద్ గజబ్ లవ్, ఆపరేషన్ పరిందే మూవీలను కూడా ఆయన తెరకెక్కించారు. సంజయ్ గధ్వి 2000 లో తేరే లియే మూవీలో డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. 2004లో యాక్షన్ థ్రిల్లర్ ధూమ్‌తో సంజయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ట్విటర్ వేదికగా తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News