Monday, January 20, 2025

‘గేమ్ ఛేంజర్’ విడుదలపై డైరెక్టర్ శంకర్ క్లారిటీ

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ లెవెల్‌లో ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాపై తాజాగా డైరెక్టర్ శంకర్ ఓ అప్‌డేట్ ఇచ్చారు. స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు -2’ చిత్ర యూనిట్ తాజాగా మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ‘గేమ్ ఛేంజర్’ విడుదలపై ప్రశ్నించగా.. శంకర్ దీనికి సమాధానం ఇచ్చారు.

రామ్‌చరణ్ పోర్షన్‌కు సంబంధించిన షూటింగ్ ముగిసిందని.. ఇంకో 10-15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని.. అది పూర్తవ్వగానే, ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఇక ‘గేమ్ ఛేంజర్’ మూవీలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోండగా ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News