Saturday, September 21, 2024

రోడ్డు ప్రమాదంలో డైరెక్టర్ శంక‌ర్ అసిస్టెంట్ ‌మృతి..

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: తమిళ సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రియేటీవ్ డైరెక్టర్ శంక‌ర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌ని చేసిన డైరెక్టర్ అరుణ్ ప్ర‌శ‌స్త్ శుక్రవారం జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందారు. కోయంబ‌త్తూర్‌లోని మెట్టుపాల్యం ద‌గ్గ‌ర త‌న బైక్‌ని లారీ ఢీకొట్టడంతో అరుణ్ ప్ర‌శ‌స్త్ చనిపోయారు. ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ”యంగ్ డైరెక్ట‌ర్, ఇంత‌క‌ముందు నా ద‌గ్గ‌ర ప‌ని చేసిన అసిస్టెంట్ అరుణ్ ‌మృతి గుండెలు ప‌గిలే బాధ‌ని క‌లిగిస్తుంది. ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటూ కష్టపడి పనిచేసేవారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ స‌భ్యుల‌కి, స్నేహితులకు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను” అని శంక‌ర్ ట్వీట్ చేశారు.

Director Shankar Assistant dies in Road Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News