Tuesday, December 24, 2024

ఎంటర్‌టైనింగ్, ఎనర్జిటిక్ ప్రేమ కథ ‘ఖుషి’..

- Advertisement -
- Advertisement -

లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను సరికొత్తగా తెరపై చూపిస్తూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ సినిమాలు సకుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన కొత్త సినిమా ‘ఖుషి’ సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ‘ఖుషి’ విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమా దర్శకుడు శివ నిర్వాణ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

హార్ట్ టచింగ్‌గా ఉంటాయి…
పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సమస్యలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో టైటిల్‌కు తగినట్లుగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కథను చెప్పాలని అనుకున్నాను. ట్రైలర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉన్న సీన్స్ చూశారు. ఇవన్నీ థియేటర్‌లో హార్ట్ టచింగ్‌గా ఉంటాయి.
ఆ పాయింట్‌ను థియేటర్‌లోనే చూడాలి…
ఈ సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. నేటి సమాజంలోని ఒక సమస్యను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. వాళ్లకూ ఈ పాయింట్ కనెక్ట్ అయింది. ఆ పాయింట్ ఏంటనేది ట్రైలర్‌లో మేము చూపించలేదు. థియేటర్‌లోనే చూడాలి.
అలా ‘ఖుషి’ టైటిల్ ఫిక్స్…
నేను గతంలో తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ సినిమాల్లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించాను. కానీ ఈసారి ఒక ఎంటర్‌టైనింగ్, ఎనర్జిటిక్, సరదాగా ఉండే ప్రేమ కథను రూపొందించాలని అనుకున్నాను. విజయ్, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్ కు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా ‘ఖుషి’ టైటిల్ ఫిక్స్ చేశాం.

ఆ ఆలోచనతోనే కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్…
ప్రేమ కథను ఎంత కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్. కథ రాసేప్పుడు సెకండాఫ్ రెడీ అయింది. కానీ ఫస్టాఫ్‌లో లవ్ స్టోరీని కాలేజీలో చూపించకుండా ఒక ఫీల్‌గుడ్ ప్లేస్, అందమైన ప్రాంతం నుంచి మొదలుపెడితే బాగుంటుంది అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య పరిచయం ఫన్ తో సాగాలి అనుకున్నాను. మీరు ట్రైలర్‌లో చూసినట్లు హీరో… హీరోయిన్‌ను బేగమ్ అని ఒకసారి, మరోసారి ఇంకోలా పిలుస్తుంటాడు. ఇవన్నీ సరదాగా ఉంటాయి.
స్టైలిష్ కామెడీ చేశాడు…
విజయ్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. పెళ్లి చూపులు, గీత గోవిందం సినిమాల్లో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు. కానీ ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు విజయ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అందరూ ఆయన క్యారెక్టర్‌ను సొంతం చేసుకుంటారు. ‘ఖుషి’ లో హిందూ, ముస్లిం మధ్య గొడవలు చూపించడం లేదు. కానీ ఒక సున్నితమైన సమస్యను కథలో చూపిస్తాం. అది అందరికీ నచ్చుతుంది.

చాలా అంకితభావం ఉన్న హీరోయిన్…
సమంత షూటింగ్ కోసం ఎంతో సహకరించింది. చాలా అంకితభావం ఉన్న హీరోయిన్ ఆమె. అలాంటి హీరోయిన్‌కు ఒక ఆరోగ్య సమస్య వస్తే సపోర్ట్ చేయకుంటే ఎలా. ఆమె ట్రీట్‌మెంట్ మధ్యలో వస్తా అని చెప్పేది కానీ మధ్యలో గ్యాప్ ఇస్తూ షెడ్యూల్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని..పూర్తిగా నయమైన తర్వాతే రమ్మని చెప్పాం. ‘ఖుషి’లో వింటేజ్ సమంతను చూస్తారు.
పాటలన్నీ హిట్…
హేషమ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ హిట్. నా రోజా నువ్వే… హిందీ సహా అన్ని భాషల్లో హిట్టయ్యింది. మ్యూజిక్‌కు మంచి పేరొచ్చింది కాబట్టి ఆ మ్యూజిక్‌తోనే సినిమా ప్రమోషన్ గ్రాండ్‌గా ప్రారంభించాలని అనుకొని మ్యూజిక్ కన్సర్ట్ పెట్టాం. ఇది విజయ్ చెప్పిన ఆలోచనే. ‘ఖుషి’ని థియేటర్‌లో చూసి ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News