Monday, December 23, 2024

బోలెడన్ని ఎమోషన్స్‌తో లవ్ స్టోరీ..

- Advertisement -
- Advertisement -

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘18 పేజిస్’ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సూర్యప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. “ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మాత్రమే కాదు. దీనిలో బోలెడన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఫీలింగ్ ఉంటుంది, కనెక్టవిటీ ఉంటుంది, ఫన్ ఉంటుంది. ఏమి జరుగుతుందా? అనే చిన్న థ్రిల్లింగ్ ఉంటుంది. ‘కార్తికేయ 2’ తరువాత నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి నేను ఖచ్చితంగా కొన్ని మార్పులు చేయాలి.

కానీ అవి కథాపరంగా చెయ్యలేదు. అలాగే నిఖిల్ కూడా ‘నేను పాన్ ఇండియా స్టార్ అయినా కానీ నాకు ఏ కథ చెప్పారో ఆ కథే తీయాలి ప్రతాప్’ అనేవాడు. ఇక గీతా ఆర్ట్‌లో ఈ సినిమా చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నా. పాత్రల ప్రయాణమే ఈ సినిమా కథ. సినిమా చూస్తుంటే వాళ్ళ ప్రపంచంలోకి వెళ్తాము. అన్ని రకాల భావోద్వేగాలు ఇందులో ఉంటాయి కాబట్టి నేను ఈ కథను ఎంచుకున్నాను. నేను బలంగా నమ్మేది కథను మాత్రమే. నా గురువు సుకుమార్ అన్నయ్య నేర్పించింది కూడా ఇదే. ఇక నా నెక్స్ మూవీ మైత్రి మూవీ మేకర్స్‌లో ఉండవచ్చు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది”అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News