Thursday, January 23, 2025

నాలుగు ఎపిసోడ్స్‌కి నేనే ఫైట్ మాస్టర్‌గా చేశా

- Advertisement -
- Advertisement -

క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ… అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్‌ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ తేజ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఈ సినిమాలో దాదాపు 14 యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కథలో భాగంగానే ఉంటాయి. ఇందులో ఓ నాలుగు ఎపిసోడ్స్‌కి నేనే ఫైట్ మాస్టర్‌గా చేశాను.

మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ సినిమాను షూట్ చేశాము. అక్కడి కొత్త లోకేషన్స్ ఇప్పటివరకూ ఏ సినిమాలో రాలేదు. నేను మ్యూజిక్ నుంచి కథ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. ట్యూన్, లిరిక్స్ అన్నీ కథని ముందుకు తీసుకెళ్ళాలి. ఆర్పీ పట్నాయక్ చాలా మంచి పాటలు ఇచ్చారు. అనూప్ నేపథ్య సంగీతం చేశారు. ఇందులో అభిరామ్ అద్భుతంగా నటించాడు అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News