సినిమా డైరెక్టర్ త్రినాథరావు నటిపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రినాథరావుకు నోటీసులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘మజాకా’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో యాక్టర్ అన్షుపై డైరెక్టర్ త్రినాథరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈసినిమాలో సందీప్ కిషన్, రీతు వర్మ నటిస్తుండగా, ఇందులో మన్మథుడు హీరోయిన కీలక పాత్రలో నటిస్తోంది. టీజర్ లాంచ్‌కు సంబంధింని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాటిని చూసిన మహిళా కమిషనర్ త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. నోటీసులు అందుకున్న తర్వాత త్రినాథరావు కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
మహిళలందరికీ క్షమాపణలుః త్రినాథరావు, సినీ డైరెక్టర్
తన మాటల వల్ల బాధపడ్డ మహిళలందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు డైరెక్టర్ త్రినాథరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ‘నా ఉద్దేశం ఎవరినీ బాధ కలిగించడం కాదని, తెలిసి చేసినా, తెలియకుండా చేసినా తప్పు తప్పేనని, పెద్దమనసు చేసుకుని నన్ను క్షమించాలని కోరారు’