Thursday, January 23, 2025

‘ధమాకా’ పూర్తి ఫ్యామిలీ ప్యాక్

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’ధమాకా’. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

ఈనెల 23న ’ధమాకా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో ఉండే రవితేజ మార్క్ సినిమా ధమాకా. రవితేజని ఎలా చూడాలని అనుకున్నానో అలా తెరపై చూపించాను. నా గత చిత్రాలు నేను లోకల్, సినిమా చూపిస్తా మామా, హలో గురు ప్రేమ కోసమే, మేం వయసుకు వచ్చాం సినిమాలు ఎనర్జిటిక్‌గా వుంటాయి. రవితేజ ఎనర్జిటిక్ హీరో. నా సినిమాలు కూడా ఎనర్జిటిక్ వుంటాయి. ఈ రెండు ఎనర్జీలు కలిస్తే ఎలా వుంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో వచ్చింది. దీనికి ఎక్కడా తగ్గకుండా ఉండటానికి విశ్వ ప్రయయత్నాలు చేశాం.

ఈ సినిమాకి డబుల్ ధమాకా అనే క్యాప్షన్ పెట్టడానికి కారణం కూడా అదే. నా గత సినిమాలని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేశారో… దానికి రెట్టించి ‘ధమాకా’ని ఎంజాయ్ చేస్తారు. మొదట హీరోయిన్ శ్రీలీలని కొత్త అమ్మాయి అన్నారు. అయితే ఇప్పుడు శ్రీలీల డిమాండ్ హీరోయిన్ అయింది. ఆమె చాలా ఎనర్జిటిక్ అండ్ టాలెంటడ్. అద్భుతమైన డ్యాన్సర్. తనే సొంతగా డబ్బింగ్ చెప్పింది. ‘ధమాకా’ మ్యూజిక్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. రిలీజైన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో చాలా కష్టపడ్డాడు. ‘ధమాకా’ పూర్తి ఫ్యామిలీ ప్యాక్. ఈనెల 23న విడుదలవుతుంది. క్రిస్మస్ వేడుకలు మా ‘ధమాకా’తో మొదలవుతాయనే నమ్మకం వుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News