Friday, December 20, 2024

‘టైగర్ నాగేశ్వరరావు’ లార్జర్ దేన్ లైఫ్ ఎంటర్ టైనర్..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు వంశీ కృష్ణ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు.

‘టైగర్ నాగేశ్వరరావు’ కథని ఎంపిక చేసుకోవడానికి కారణం ?
ప్రతి దర్శకుడికి ఒక బయోపిక్ చేయాలని వుంటుంది. ‘నాయకుడు’ చిత్రం నాకు చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి మనసుకి దగ్గరైన చిత్రమది. నేను చేసే చిత్రాలలో ఒక బయోపిక్ చేయాలనుకున్నాను.  బయోపిక్స్ చాలా వరకూ క్రీడాకారులు, నాయకులు, సినీ తారలపై వుంటాయి. అయితే బయోపిక్ లో తెలియని కథ కూడా చెప్పొచ్చు. ఏదైనా కొంచెం యూనిక్ గా చేయడానికి ఇష్టపడతాను. ‘టైగర్ నాగేశ్వరరావు’ అంటే అక్కడక్కడ తెలుసు. ఆయన కథపై ఒక ఆసక్తి వుంది. ఆయన గురించి దాదాపు రెండేళ్ళు రీసెర్చ్ చేశాం. రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాక చాలా విషయాలు తెలిశాయి. ఆ పాత్ర నన్ను కూడా వదల్లేదు. టైగర్ నాగేశ్వరరావు మనకి తెలిసినంతవరకూ ఒక దొంగే. అయితే ఆయన ఇన్నర్ సోల్ ఎవరికీ తెలీదు. అది సినిమాలో చూపించాలనిపించిది. టైగర్ నాగేశ్వరరావు అంటే ఒక ఎమోషన్. ఆయనకి మించిన ఎమోషన్ నేను చూడలేదు. ఆయనలో రెండు షేడ్స్ వున్నాయి. ఒక షేడ్ లో చాలా భయంకరమైన వ్యక్తి. మరో కోణంలో  చాలా మనసున్న మనిషి. ఈ రెండూ కోణాలు ఆయనలో తీవ్రంగా వుంటాయి. టైగర్ నాగేశ్వరరావు బ్యూటీ అదే.

టైగర్ నాగేశ్వరరావు గురించి కొన్ని కథలు ప్రచారంలో వున్నాయి? మీకథకు ఎలాంటి అంశాలు ఇముడ్చుకోవాలనేది సవాల్ గా అనిపించిందా ?
బయోపిక్స్ చేయడం కష్టం. ఎందుకంటే సగం సమాచారం తెలిసిపోయింటుంది. తెలిసిన విషయాన్ని ఆసక్తికరంగా చెప్పడం అంత తేలిక కాదు. అందుకే బయోపిక్ ని ప్రేక్షకులకు ఆసక్తికరంగా చెప్పడం కష్టంతో కూడుకున్న పని.  టైగర్ నాగేశ్వరరావు గురించి కూడా కొంత సమాచారం తెలుసు. దాన్ని తెరపై చూస్తున్నపుడు ఎమోషనల్ కనెక్ట్ చేస్తూ ఆసక్తిగా మలచడం ఒక సవాల్ తో కూడుకున్నదే.

టైగర్ నాగేశ్వరరావు గురించి వెలుగులో వున్న చాలా సంఘటనలు వాస్తవమా కాదా ? అనేది తెలుసుకోవడంలో మీరు ఎలాంటి కసరత్తు చేశారు ?
నా పరిశోధనలో స్టువర్ట్ పురంలో టైగర్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను, కొంతమంది పోలీసు అధికారులని కలసి ఆయన గురించి సమాచారం సేకరించాను. అయితే టైటిల్ లో మాత్రం నిజమైన రూమర్స్ ఆధారంగా అనే వేశాను. దీనికి కారణం ఆయన గురించి కథలు కథలుగా వున్నాయి కానీ ఆధారాలు లేవు. రికార్డ్ లేదు. ట్రైన్ వేగంతో ఆయన పెరిగెత్తి రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారని చెబుతున్నారు. నిజంగా అది సాధ్యం కాదనిపిస్తుంది. కానీ ఆయన చేసేవాడని చెబుతున్నారు. చెప్పి మరీ దొంగతనాలు చేసేవారట, ఇది వినడానికి బావుంది కానీ ఎలా చేశారనేది మనకి తెలీదు. ఇలా చాలా సంఘటనలు వున్నాయి. కానీ దీనికి ఆధారం లేదు. ఆయనకి సంబధించిన డాక్యుమెంట్ ఏదీ లేదు.

బయోపిక్ అంటే చాలా సమాచారం దొరుకుతుంది. కానీ ఆయన గురించి రాతపూర్వకంగా ఏదీ లేదు. ఇది కూడా నాకు చాలా టఫ్ గా అనిపించింది. అందుకే దీనికి బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని వేశాం. ఇందులో దాదాపు అన్నీ పాత్రలు రియల్ స్టువర్ట్ పురం నేపధ్యంలో వుంటాయి. 1980 నేపధ్యంలో నడిచే కథ ఇది. ఆయన గురించి రీసెర్చ్ చేస్తున్న క్రమంలో చాలా అద్భుతమనిపించిన కొన్ని సంఘటనలు వున్నాయి. అలాంటి అద్భుతమైన సన్నివేశాలన్నీ ఇందులో వుంటాయి. ట్రైన్ సీక్వెన్స్ ని గోదావారి బ్రిడ్జ్ మీద తీశాం. అప్పటి కథని ఇప్పటి ప్రేక్షకులని ఆకట్టుకునేలా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాం.

టైగర్ నాగేశ్వరరావు కథ రవితేజ గారికి చెప్పినపుడు రియాక్షన్ ఏమిటి ?
రవితేజ గారు మొదట ఫస్ట్ హాఫ్ విన్నారు. షూటింగ్ వుంది మిగతాది రేపు వింటానని చెప్పారు. అలా అన్నారంటే ఇంక కాల్ రాదేమో అనుకున్నాను( నవ్వుతూ) మరుసటి రోజు కరెక్ట్ గా చెప్పిన సమయానికి ఫోన్ చేశారు. వెళ్లి కథ చెప్పాను. క్లైమాక్స్ చెబుతుండగానే ఆయన లేచి జుట్టు ఇలా పెంచితే బావుటుందా? ఇలా లెన్స్ పెట్టుకోనా ? అని అన్నారు. ఆయన ఆల్రెడీ కథని ఓకే చేసి ముందుకు వెళ్ళిపోయారు. అది నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించిది. అది చాలా ఎమోషనల్ మూమెంట్.

మీ కెరీర్ లో బడ్జెట్, స్టార్  ప్రకారంగా ఇది చాలా భారీ సినిమా కదా ? ఒత్తిడి ఫీలయ్యారా?
లార్జ్ స్కేల్ సినిమాలలో హీరో, నిర్మాత అంత బలంగా నమ్మిన తర్వాత అంత ఒత్తిడి వుండదు. రవితేజ గారు చాలా కేర్ తీసుకున్నారు. ఇందులో చాలా మంచి నటులని తీసుకున్నాం. హరీష్, జీషు చాలా కొత్తగా కనిపిస్తారు. అందరూ సొంత సబ్జెక్ట్ లా బిలివ్ చేసి చేశారు. బడ్జెట్ విషయానికి వస్తే.. ఎక్కడా రాజీపడకూడదని ముందే అనుకున్నాం. అలాగే అనుకున్న సమయానికి పూర్తి చేయాలని భావిస్తాను. ఎడిటింగ్, ప్రొడక్షన్ నేపథ్యం నుంచి రావడం పూర్తి కంట్రోల్ వుంది. అలాంటి కంట్రోల్ మన చేతిలో వుంటే ఎలాంటి ఒత్తిడి వుండదు.

హీరోయిన్ నుపూర్ పాత్ర గురించి ?
దొంగతనాలు చేసిన బంగారాన్ని అమ్మడానికి ఒక చోటు కావాలి. ఆ బెల్ట్ లో చాలా మంది మార్వాడీలు వచ్చారు. అలా ఓ మార్వాడీ అమ్మాయితో టైగర్ నాగేశ్వరరావు కి అనుబంధం ఏర్పడుతుంది. అదే నుపూర్ పాత్ర. ఇది కల్పితం కాదు. టైగర్ నిజ జీవిత కథలో వుంది. ఆ పాత్రని నుపూర్ చాలా చక్కగా చేసింది.

రేణు దేశాయ్ గారి పాత్ర ఎలా వుంటుంది ?
హేమలత లవణం గారి గురించి అందరికీ తెలుసు. అలాంటి పాత్రకు రేణు దేశాయ్ గారు ఐతే బావుంటుదనిపించింది. రేణు గారికి ఈ పాత్ర గురించి చెప్పిన తర్వాత రేణు గారికి చాలా నచ్చింది. ఈ పాత్ర కోసం హేమలత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాను. రేణు గారు ఆ పాత్రలో చాలా అద్భుతంగా చేశారు

 టైగర్ నిడివి రెండు గంటల 52 వుంది. ఈ మధ్య కాలంలో సినిమాలతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగా వుంది కదా ?
నిడివి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సినిమా చూసిన తర్వాత మరో పది నిముషాలు వుంటే బావుండేదని ఫీలింగ్ వుంటుంది. రోలింగ్ టైటిల్ వస్తున్నపుడు కూడా చైర్ నుంచి లేవరనే నమ్మకం వుంది.

ఈ సినిమాలో సవాల్ గా అనిపించిన సీక్వెన్స్ లు ఏమిటి ?
ట్రైన్ సీక్వెన్స్. గోదావరి బ్రిడ్జ్ ని రిక్రియేట్ చేయడం మామూలు విషయం కాదు. దీనికి డీవోపీ, ఫైట్ మాస్టర్స్.. ఆర్ట్ డిపార్ట్మెంట్.. అందరూ నా విజన్ కి అద్భుతంగా సపోర్ట్ చేశారు. ఆ సీక్వెన్స్ తీయడానికి 20 రోజులు పట్టింది. దాని సిజీ చేయడానికి ఏడాది పట్టింది. చెన్నైలో పోర్ట్ సీక్వెన్స్, జైలు నుంచి తప్పించుకునే సీక్వెన్స్..  ఇలా చాలా వండర్ ఫుల్ సీక్వెన్స్ వున్నాయి.

జీవీ ప్రకాష్ ని తీసుకోవడానికి కారణం ?
జీవీ ప్రకాష్ స్క్రిప్ట్ నిఫాలో అయ్యే కంపోజర్. తను కథ సోల్ ని పట్టుకోగలడు. అదే సమయంలో దాన్ని కమర్షియల్ గా ఎలా చేయాలో తెలిసిన కంపోజర్. నా మైండ్ సెట్ తనకి తెలుసు. అందుకే  తనతో ట్రావెల్ అయ్యాను.

అభిషేక్ గారి నిర్మాణం గురించి ?
అభిషేక్ గారు నిర్మాతలా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లా వుంటారు. ఇంత పెద్ద సినిమా చేయాలంటే నమ్మకం కావాలి. నాపై ఆ నమ్మకం వారికి వుంది. నాకు కావాల్సింది సమకూర్చారు. వారి సపోర్ట్ వలనే ఇంత గ్రాండ్ గా వచ్చింది.

అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ గురించి ?
అవినాష్ కొల్లా బ్రిలియంట్. తను స్టువర్ట్ పురం క్రియేట్ చేశాడు. అది హార్ట్ ఆఫ్ ది సోల్ గా వుంటుంది. ఈ కథలో ప్రతి పాత్ర, క్రాఫ్ట్ మాట్లాడుతుంది.

భవిష్యత్ లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ?  
లార్జ్ స్కేల్ కథలు చేయాలని వుంది. గొప్పగొప్ప కథలకు మన దేశం పుట్టినిల్లు. సరిగ్గా రీసెర్చ్ చేస్తే చెప్పడానికి చాలా మంచి కథలు వున్నాయి. అలాంటి కథలు తీసుకున్నాను. నెక్స్ట్ సినిమాలు కూడా లార్జ్ స్కేల్ లో వుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News