Monday, December 23, 2024

నెక్ట్స్ ‘బింబిసారుడు 2’ ఉంటుంది

- Advertisement -
- Advertisement -

నందమూరి కళ్యాణ్‌రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌పై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 5న ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట్ మీడియాతో మాట్లాడుతూ.. “బింబిసారుడు అనే రాజు 500 సంవత్సరాలకు ముందు పరిపాలించిన రాజు. ఆయనకు సంబంధించిన వివరాలేమీ తెలియదు. కాబట్టి నేను కొత్తగా తెలుసుకుంటూ ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాను. సినిమా కోసం బింబిసారుడుకి సంబంధించిన త్రిగర్తల అనే సామ్రాజాన్ని సృష్టించాం. ఇది పూర్తిగా కల్పిత కథ. ఇక గత ఏడాది సెప్టెంబర్‌కే షూటింగ్ పూర్తయింది. అయితే సినిమాలో సీజీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దీంతో సినిమాకు సమయం పట్టింది. బింబిసార చిత్రాన్ని రెండు భాగాలుగా చూపించబోతున్నాం. ఇందులో పాత్రలన్నింటికీ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అన్నింటినీ ఓ సినిమాలోనే చూపించలేం. కాబట్టి రెండు భాగాలుగా చేయాలని అనుకుంటున్నాం. నెక్స్ ‘బింబిసారుడు 2’ ఉంటుంది” అని అన్నారు.

Director Vashist about ‘Bimbisara’ at press meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News