Monday, December 23, 2024

విశ్వనాథ్ మృతి….. కూర్చోబెట్టి ఖననం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బ్రాహ్మణ సాంప్రదాయక లింగదారుల పద్దతిలో కె విశ్వనాథ్ అంత్యక్రియలు జరుగుతాయి. లింగధారుల పద్ధతిలో శరీరాన్ని కూర్చోబెట్టి ఖననం చేస్తారు. పంజాగుట్ట శ్మశానంలో కె విశ్వనాథ్‌ని అంత్యక్రియలు జరుగుతాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటల నుంచి అంత్యక్రియలు ప్రక్రియ ప్రారంభమవుతాయని, ఫిల్మ్‌నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.
కళాతపస్వి, దర్శకధీరుడు వి విశ్వనాథ్ మృతిపట్ల నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. కళాతపస్వి విశ్వనాథ్ మరణం చాలా బాధాకరమైన విషయమన్నారు. ఆయన చేసిన సినిమాలు తనకు చాలా ఇష్టమన్నారు. ఆయన తెలుగు సినిమాకు మూల స్తంభం అని అన్నారు. తన సినిమాల ద్వారా తెలుగు సంస్కృతిని తెలియజేశారని కొనియాడారు. ఆయన మరణం సినిమా రంగానికి తీరని లోటు అని అన్నారు.

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News