Monday, December 23, 2024

నానిని కొత్తగా చూస్తారు..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ’అంటే సుందరానికీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నజ్రియా తెలుగులో హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. “ఈ సినిమాతో ప్రేక్షకులను కేవలం నవ్వించడమే కాదు అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఎమోషనల్‌గా కూడా చాలా బలమైన కంటెంట్ వుంటుంది. నాకు చాలా ఇష్టమైన నవల బారిష్టర్ పార్వతీశం. ఈ కథలోని ఒక చిన్న ఎపిసోడ్‌లో దాని ప్రేరణ తీసుకొని పంచకట్టు, మిగతా సంరంజామా పెడితే బావుంటుందనిపించి పెట్టాం. అయితే దీనికి కథకి ఎలాంటి సంబంధం లేదు. ఐదేళ్ళ క్రితమే ఈ కథ ఐడియా వచ్చింది. మొదట విష్ణుతో షేర్ చేసుకున్న ఈ కథకి నాని అయితే బావుంటుందని అప్పుడే అనుకున్నాం. ఇది చాలా నిజాయితీ గల కథ. కథలో పాత్రలు కనిపిస్తాయి తప్పితే ప్రత్యేకమైన ఎలివేషన్స్ ఏమీ వుండవు. నాని ఇప్పటివరకూ ఇలాంటి పాత్రని చేయలేదు. చాలా డిఫరెంట్ పాత్ర. ఆయన పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఫన్ వుంటుంది. దాని వెనుక బాధ వుంటుంది. అయితే అవన్నీ లోపల పెట్టుకొని బయటకి మాత్రం ఏమీ కనిపించకుండా మాట్లాడే పాత్ర చేయడం అంత సులువు కాదు. నాని ఫన్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇందులో ఖచ్చితంగా డిఫరెంట్ నానిని కొత్తగా చూడబోతున్నారు. లీలా థామస్ పాత్ర చేయడానికి బలమైన పర్ఫార్మర్ కావాలి. నజ్రియా అయితే ఆ పాత్రకు కరెక్టని భావించాం. లక్కీగా ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది. ’అంటే సుందరానికీ’ కథ యూనివర్సల్ కథ. కథ రాసినప్పుడే ఇది సౌత్‌కి బావుంటుందని అనుకున్నాం” అని అన్నారు.

Director Vivek Athreya about ‘Ante Sundaraniki’ movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News