Friday, April 4, 2025

అత్యాచారం కేసు: మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఏడాది జరిగిన మహాకుంభమేళలో మోనాలిసా అనే యువతి బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. పూసలమ్మే మోనాలిసాను సోషల్‌మీడియాలో ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేశారు నెటిజన్లు. దీంతో కుంభమేళలో జరుగుతున్న సమయంలోనే ఆమెతో ఫోటోలు దిగడానికి జనాలు తెగ ఆసక్తి కనబరిచారు. అంతేకాక.. ఆమెకు ఓ సినిమా ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఆమెకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు.

సనోజ్ మిశ్రా తనపై అత్యాచారం చేయడమే కాకుండా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడని ఓ యువతి ఢిల్లీలోని నబీ కరీమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2020లో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దర్శకుడు సనోజ్ మిశ్రాకు యుపిలోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన యువతితో పరిచయమైంది. 2021 జూన్ 7న తను ఝాన్సీ రైల్వేస్టేషన్ వద్ద ఉన్నానని.. అక్కడకు రావాలని ఆ యువతిని కోరగా.. ఆమె రాలేదు. రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడట.

దీంతో అతన్ని కలిసేందుకు వెళ్లిన యువతిని రిసార్ట్‌కి తీసుకువెళ్లి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడట. ఈ విషయం బయట చెబితే.. ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడట. ఆ తర్వాత కూడా పెళ్లి, సినిమా అవకాశాల పేరు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసినట్లు యువతి తెలిపింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు సనోజ్‌ను అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News