Wednesday, January 22, 2025

పెన్షన్ పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సంబరాలు

- Advertisement -
- Advertisement -

సిఎం చిత్రపటానికి పాలాభిషేకాలు…బాణసంచా పేల్చి ఆనందోత్సవాలు
దివ్యాంగులకు కొండంత అండ సిఎం కెసిఆర్ … చైర్మన్ వాసుదేవ రెడ్డి

హైదరాబాద్ : వికలాంగులకు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వికలాగులు సంబరాలు చేసుకున్నారు. ఆనందోత్సవాలతో బాణసంచా కాల్సి మిఠాయీలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోశాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రుణపడి ఉంటామని వికలాంగులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆదివారం తెలంగాణ భవన్‌లో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కెతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో వికలాంగులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెన్షన్లు పొందుతున్న లబ్దిదారులు బాణసంచా కాల్చి ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని కొనియాడారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా దివ్యాంగులకు ఇప్పటికే ఇస్తున్న రూ. 3,016/- పెన్షన్‌ను రూ. 4,016/- పెంచినందుకు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగుల పాలిట దేవుడని కొనియాడారు. అమ్మ అయినా సరే అడగకుండా అన్నం పెట్టదని, అలాంటిది ఎలాంటి ధర్నా, దరఖాస్తు లేకుండానే దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతూ జీవో విడుదల చేయడం పట్ల దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారని తెలిపారు.

దివ్యాంగుల సంక్షేమం కోసంముఖ్యమంత్రి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, ఒకవైపు జీవనోపాధికి భరోసా కల్పిస్తూ మరోక వైపు ఆసరా పెన్షన్ రూపంలో వారి జీవితానికి ఆర్దిక భరోసా అందిస్తున్నారని అన్నారు. దివ్యాంగుల సమాజం తరఫున ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం గడిచిన తొమ్మిది ఏళ్లలో పదివేల కోట్లు ఖర్చుపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. పెరిగిన ఆసరా పెన్షన్ రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకు పైగా లబ్ధి దారులైన దివ్యాంగులకు మరింత ఆర్థిక భరోసా అందిస్తుందన్నారు. ఒక్క పెన్షన్లు కాకుండా మరోపక్క కార్పొరేషన్ ద్వారా ఉచితంగా సహాయ ఉపకరణాలు, సబ్సిడీ రుణాలు, నిరుద్యోగ వికలాంగులకు ఉచిత కోచింగ్ తో అండగా ఉంటున్నామని వాసుదేవ రెడ్డి పేర్కొన్నారు. మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యంగుల నాయకులు మున్నా, గుత్తికొండ కిరణ్,నల్గొండ శ్రీనివాస్ సుమన్, రాజ్యలక్ష్మి, కోమురెల్లి, వేణు,నాగరాజు, మనీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News