Monday, December 23, 2024

దివ్యాంగుల పింఛన్ పెంపుకు ఉత్తర్వులు జారీ.. సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దివ్యాంగుల పింఛన్ ను రూ.1,000 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతి నెలా రూ.3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు,  ఇకనుంచి రూ.4,016 పెన్షన్ ను అందుకోనున్నారు.

కాగా, దివ్యాంగుల పింఛన్ ను పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి దివ్యంగులతో కలిసి బిఆర్ఎస్ ఎంపి మాలోత్ కవిత పాలాభిషేకం చేశారు. అనంతరం దివ్యంగులకు మిఠాయిలు తింపించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News