Monday, January 6, 2025

హామీల అమలు కోసం 10న వికలాంగుల మహాధర్నా

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కిచ్చిన ఎన్నికల హామీ అమలు డిమాండ్‌తో ఈ నెల 10న హైదరాబాద్‌లో వికలాంగుల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య తెలిపారు. ఈ మహా ధర్నాకు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొంటున్నట్లు తెలిపారు. వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచాలని, కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ మహా ధర్నాను చేపట్టింది. మహాదర్నకు టిఆర్‌ఎస్, సిపిఎం, సిపిఐ, టిజెఎస్, టిడిపి పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఎంబి భవన్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ భవన్ లో టిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌లతో పాటు టిజెఎస్,

సిపిఐ పార్టీల నేతలను వారి కార్యాలయాలకు వెళ్ళి ధర్నాకు హాజరు కావాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర ప్రతినిధి బృందం కె వెంకట్, ఎం అడివయ్య, ఆర్ వెంకటేష్, జె మల్లేష్, ఆదర్శ్ తదితరులు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత 20 రోజుల నుండి రాష్ట్రంలో వికలాంగులు ఉద్యమం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. వికలాంగులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయా పార్టీల నాయకులను కోరారు. ధర్నాకు హాజరై మద్దతు ఇస్తామని అసెంబ్లీలో ఆసరా పెన్షన్స్ పెంపు కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయా పార్టీల నేతలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News