Monday, December 23, 2024

స్లాట్ బుకింగ్ సమయం పెంచాలని దివ్యాంగుల ధర్నా

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : కారేపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో శనివారం దివ్యాంగులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సదరం సర్టిఫికెట్లు పొందుటకు మీసేవా కేంద్రంలో స్లాట్ బుకింగ్ సమయాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సదరం సర్టిఫికెట్ కోసం ముందస్తు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు వ్బ్సైట్ ఓపెన్ అవుతుందని తెలియడంతో ఉదయాన్నే అనేకమంది మీసేవా కేంద్రాలకు తరలివచ్చారు. కొద్ది నిమిషాల్లోనే స్లాట్ బుకింగ్ క్లోజ్ అయ్యింది. దీంతో దివ్యాంగులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సమయం పెంచడంతోపాటు కారేపల్లి లోనే సదరన్ క్యాంప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. దివ్యాంగులకు మద్దతుగా సీపీఐ (ఎం), న్యూడెమోక్రసీ నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు, కె.నరేంద్ర, వై.పకాష్, మద్దతు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News