Monday, December 23, 2024

సర్కార్ పై రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల ధర్నా

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ వాటా రూ. 300 లను రూ. 3000 లకు, రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రూ. 6000 లకు పెంచాలని, అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి ) డిమాండ్ చేసింది. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు దర్నాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, హైదరాబాద్ సౌత్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి శశికల హైదరాబాద్‌లో జరిగిన ధర్నాలో మాట్లాడుతు 2011 నుండి కేంద్ర ప్రభుత్వం వాటా పెన్షన్లలో కేవలం రూ. 300 మాత్రమే ఉందని ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ వాటా రూ. 3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచి వెంటనే అమలు చేయాలని కోరారు. 2024 జనవరి నుండే పెరిగిన పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి 7నెలలు గడుస్తోందన్నారు.పెన్షన్స్ పెంపు కోసం 44,49,767 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారన్నారు. కొత్త దరఖాస్తు చేసిన 24.84 లక్షల మందికి ఇప్పటికి పెన్షన్ మంజూరు కాలేదని తెలిపారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్స్ మంజూరుకు ఆదాయ పరిమితి విధిస్తూ జారీ చేసిన జిఓ 17ను వెంటనే రద్దు చేయాలని, .2015 కంటే ముందు సదరం సర్టిఫికెట్ పొందిన వారు ఆన్‌లైన్‌లో ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల గుర్తింపు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని,

ప్రతి నెల 5వ తేదీలోపు పెన్షన్స్ పంపిణి చేసే విదంగా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న మహిళా శక్తి క్యాంటిన్లలో వికలాంగులకు 5శాతం కేటాయించే విదంగా చర్యలు తీసుకోవాలని, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవేన్స్ కోసం లబ్ధిదారుల గుర్తింపు పక్రియను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షులు జగదీష్, కార్యదర్శి నాగమణి, హైదరాబాద్ జిల్లా నాయకులు రాజు, సంజీవ, నర్సింగ్, కుమార్, మమత, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News