Friday, December 27, 2024

తమ్మళిబాయ్ తండాలో బాలుడి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: తమ్మళిబాయి తండాలో బాలుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఆదివారం కొండాపూర్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మళిబాయ్ తండాకు చెందిన సూర్య సౌమ్య దంపతులకు కొడుకు వడిత్య తరుణ్ (16) చదువుతున్నాడని పోలీసులు చెప్పారు. శనివారం సాయంత్రం క్రికెట్ ఆడతానని ఇంట్లోనుంచి వెళ్లాడన్నారు. ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊరంతా తమ చుట్టుపక్కల గ్రామాల్లో బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకి తెలియలేదన్నారు. ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో తండ్రి కొండాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకి కోసం విచారణ ప్రారంభించామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News