Sunday, December 22, 2024

హైదరాబాద్‌లో వ్యాపారవేత్త కుమారుడి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః జూబ్లీహిల్స్‌లో వ్యాపారవేత్త కుమారుడు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. శ్రీనగర్ కాలనీకి వెళ్లి తిరిగి వస్తానని ఇంట్లో చెప్పి జయేష్ (17) బయటికి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది రోజుల నుంచి జయేష్ కోసం వెతుకుతున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. అతనిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే పెద్ద వ్యాపారవేత్త కుమారుడు కావడంతో ఈ విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News