Monday, January 20, 2025

వ్యక్తి అదృశ్యం…

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : తుక్కోజివాడి గ్రామానికి చెందిన సిలారి సాయిలు కనిపించడం లేదంటూ గురువారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయినట్లు ఎస్సై రాజు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివనగర్ మండలం తుక్కోజివాడి గ్రామానికి చెందిన సిలారి సాయిలు 50 సెప్టెంబర్ 1 తేదిన గ్రామంలో కులసంఘం మీటింగ్‌లో పాల్గొన్నాడు. తరువాత తన వద్ద ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్ ఇంట్లోనే పెట్టి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అడ్లూర్ ఎల్లారెడ్డి, బ్రహ్మనపల్లిలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. ఎక్కడా ఆచూకి లభించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాధు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇలా ఇంటి నుండి వెళ్లిపోయి నాలుగైదు రోజుల తరువాత తిరిగి వచ్చాడని సాయిలు భార్య ఫిర్యాదుేలో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News