Monday, December 23, 2024

గురుకులం నుంచి విద్యార్థి అదృశ్యం.. విషాదాంతం

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్‌: నారాయణఖేడ్ పట్టణ శివారులో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 9వ తరగతి చదువుతున్న ఎలుకరి మహేష్ అనే విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి చెరువులో శవమై తేలాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. న్యాల్‌కల్ మండలం గుంజేటి గ్రామానికి చెందిన ఎలుకరి మహేష్ గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాడన్నారు. శుక్రవారం మహేష్, మరో ముగ్గురు విద్యార్థులు గురుకులంలో ఎవరికి సమాచారం ఇవ్వకుండా మధ్యాహ్నాం బయటకు వెళ్లారన్నారు. రాత్రి అయ్యే సరికి కూడా తిరిగి గురుకులంకు రాకపోవడంతో శనివారం మహేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

ప్రిన్సిపల్‌ను నిలదీసిన విద్యార్థి కుటుంబ సభ్యులు

శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన ఖేడ్ తెలంగాణ గిరిజన సంక్షేమ పాఠశాల మరియు కళాశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి ఎలుకరి మహేష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గురుకులం ప్రిన్సిపల్ విజయ్‌కుమార్‌ను నిలదీశారు. ప్రిన్సిపల్‌తో పాటు అధ్యాపకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విద్యార్థి గురుకులంకు రాకపోతే ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News