Saturday, November 2, 2024

యూనిఫాంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, విశ్వాసం పెంపొందుతుంది

- Advertisement -
- Advertisement -

దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జయంతి మాల్య
ఎస్‌సిఆర్‌డబ్బ్యుడబ్ల్యుఓ ఆధ్వర్యంలో విద్యా విహార్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు
నూతన యూనిఫాం పంపిణీ


మనతెలంగాణ/హైదరాబాద్:  దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం (ఎస్‌సిఆర్‌డబ్బ్యుడబ్ల్యుఓ) అధ్యక్షురాలు జయంతి మాల్య ఆధ్వర్యంలో సికింద్రాబాద్ చిలకలగూడలోని విద్యా విహార్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు శుక్రవారం రెండు జతల పాఠశాల యూనిఫాంను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం కోశాధికారి ఉషా జైన్, ఇతర కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. రైల్వే కుటుంబ సభ్యులతో పాటు సమాజంలోని ఇతర విద్యార్థుల కోసం విద్యా విహార్ ఉన్నత పాఠశాల దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

విద్యార్థులు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి

ఈ సందర్భంగా ఎస్‌సిఆర్‌డబ్బ్యుడబ్ల్యుఓ అధ్యక్షురాలు జయంతి మాల్య మాట్లాడుతూ పాఠశాల యూనిఫాంను చాలా సంవత్సరాలుగా మార్చలేదని, ఇప్పుడు ప్రకాశవంతమైన వస్త్రధారణతో కూడిన నూతన యూనిఫాంను ఎంపిక చేసినట్టు ఆమె తెలిపారు. నూతన యూనిఫాం విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటూ వారిలో విశ్వాసం పెంపొందడంలో ప్రేరణగా ఉంటుందని ఆమె తెలిపారు. ఇది క్రమశిక్షణకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో విజేతలుగా నిలవడానికి వారి ఉజ్వల భవిష్యత్‌కు మంచి విలువలతో పాటు కష్టపడే తత్త్వాన్ని అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న పాఠశాల సిబ్బందిని జయంతి మాల్య అభినందించారు. ఈ సందర్భంగా ఎస్‌సిఆర్‌డబ్బ్యుడబ్ల్యుఓచే చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన వివిధ కార్యక్రమాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News