- Advertisement -
టాటా గ్రూప్ చీఫ్ ఎన్.చంద్రశేఖరన్
న్యూఢిల్లీ : ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అండగా నిలిచారు. ఈ పథకంతో భద్రతా దళాల్లో సేవలందించే యువతకు అవకాశాలు లభిస్తాయని, దీంతో పాటు టాటా గ్రూప్‌తో సహా పరిశ్రమకు క్రమశిక్షణ, శిక్షణ పొందిన సైన్యం లభ్యమవుతుందని ఆయన అన్నారు. అగ్నిపథ్ కార్యక్రమం యువతకు గొప్ప అవకాశమే కాదు, దేశ భద్రతా దళాల్లో సేవలందించేందుకు దోహదం చేస్తుందని అన్నారు. అగ్నివీరులను టాటా గ్రూప్ గుర్తిస్తుందని, వారికి అవకాశాలు కల్పిస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్‌పిజి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గొయెంకా, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండి సంగీతా రెడ్డీలు ఈ అగ్నిపథ్ స్కీమ్‌కు మద్దతు తెలిపారు.
- Advertisement -