Friday, November 8, 2024

రంగు మారిన తుంగభద్ర జలాలు

- Advertisement -
- Advertisement -

పొలాల్లో పేరుకుపోతున్న నాచు
మూడు రాష్ట్రాల్లో తాగునీటికి ఇవే ఆధారం
ఆందోళన చెందుతున్న ప్రజలు
ప్రశ్నార్ధకంగా జలచరాల మనుగడ
కాలుష్యమే అసలు కారణమా
నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్న బోర్డు

మనతెలంగాణ/హైదరాబాద్: తుంగభద్ర నదీజలాలు రంగు మారాయి. పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారి ఆందోళన గొలుపుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తుంగభద్ర ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరింది. రిజర్వాయర్‌లో గరిష్ట నీటి నిలువ సామర్ధం 105టింసీలు కాగా, ఇప్పటికే నీటి నిలువ 90టిఎంసీలకు చేరింది. ఎగువనుంచి వచ్చిన వరద నీటితో తొణుకులు కొడుతున్న జలాశయంలోని నీరంతా పచ్చగా మారిపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలకు తుంగభద్ర జలాలే ఆధారంగా ఉంటున్నాయి.

తుంగభద్ర నదీపరివాహకంగా బళ్లారి , రాయచూరు,కొప్పళ్ల ,విజయ నగర, జోగులాంబ గద్వాల , కర్నూలు , నంద్యాల ,అనంతపురం ,కడప జిల్లాలకు చెందిన వందలాది గ్రామాల్లోని తాగునీటి పధకాలు తుంగభద్ర నదిజలాలపైన ఆధారపడి నడుస్తున్నాయి. ఒక్కసారిగా తుంగభద్ర నీరంతా ఆకు పచ్చగా మారిపోవటం , నీటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ప్రజలు ఈ నీటిని తాగేందుకు జంకుతున్నారు. తుంగభద్ర రిజర్వాయర్ నుంచి ఇటీవల కర్నూలుకడప కాలువ, హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి కాలువకు సాగు నీరు కూడా విడుదల చేశారు. ఇటు తెలంగాణలో రాజోలి బండ మళ్లీంపు పథకానికి కూడా నీటి విడుదల జరుగుతోంది . పొలాలకు కూడా ఆకుపచ్చరంగులో ఉన్న నీటిని పారించటం ద్వారా పొలాల్లో నాచు పేరుకుపోతోందంటున్నారు. తుంగభద్ర రిజర్వాయర్‌లోనే కాకుండా నదిలో ప్రవహిస్తున్న నీటిలో కూడా పలు రకాల జలచరాలు జీవిస్తున్నాయి. వీటి మనుగడ కూడా ప్రశ్నార్దకంగా మారుతోంది.
కాలుష్యమే కారణమా!
తుంగభద్ర నదీజలాలు రంగుమారటం వెనుక కాలుష్యమే కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తుంగభద్ర నీదీపరివాహకంగా కర్ణాటక రాష్టంలో పలు రకాల రసాయన పరిశ్రమలు ఉన్నాయి.వీటి ద్వారా వెలువడుతున్న కలుషిత నీరంతా నదిలోకే చేరుతుంది. రుంగు మారిన నదీజలాలు ప్రమాదకరం అని పర్యవరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. రంగు మారిన తుంగభద్ర నదీజలాల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపనున్నట్టు తుంగభద్ర బోర్డు అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News