Sunday, December 22, 2024

ఈ-గరుడ బస్సుల ఛార్జీల తగ్గింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి శుభవార్త చెప్పింది. ఆర్టీసి ఎలక్ట్రిక్ ‘ఈ- గరుడ బస్సుల’ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ ప్రకటించారు. ప్రారంభ ఆఫర్ కింద ఈ -గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆఫర్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మియాపూర్ టు- విజయవాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760లకు, ఎంజీబిఎస్ – టు విజయవాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి తగ్గించినట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read: నగరంలో భారీగా ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

మంగళవారం హైదరాబాద్ మియాపూర్‌లోని10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఎసి బస్సులను ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి విసి సజ్జనార్‌తో కలిసి ప్రారంభించగా ఈ ఏడాదిలోగా హైదరాబాద్- టు విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఎసి బస్సులను నడపనున్నారు. 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ నగరం నుంచి నిత్యం 50 వేల మంది విజయవాడ, రాజమండ్రికి ప్రయాణిస్తున్నారని, అందుకే తొలుత ఈ-గరుడ బస్సులను విజయవాడకు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News