Tuesday, December 3, 2024

వన్ ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్..!

- Advertisement -
- Advertisement -

వన్ ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ జనవరిలో భారతీయ మార్కెట్లో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు కంపెనీ ఈ మొబైల్ పై డిస్కౌంట్ ఇస్తోంది. ఇప్పట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికీ ఇది ఒక మంచి అవకాశం. వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొత్త ధర, ఫీచర్ల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

డిస్కౌంట్

వన్ ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ 8 జిబి రామ్, 128 జిబి నిల్వతో రూ. 39,998 ధరతో రిలీజ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో ఈ వన్ ప్లస్ ఫోన్‌పై 2000 రూపాయల తగ్గింపు ఉంది. ఈ ఆఫర్ తర్వాత..ఫోన్‌ను రూ. 37,998 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. రాబోయే పండుగ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ఫోన్‌పై మరింత మెరుగైన డీల్ లభిస్తుందని ఆశించవచ్చు.

 

ఫీచర్లు

వన్ ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఎల్ టిపిఒ 4.0 ఎఎంఒఎల్ఇడి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ 120హెచ్ జడ్, గరిష్ట ప్రకాశం 4500. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఒసి. బ్యాటరీ విషయానికి వస్తే 5,500ఎంఎహెచ్ ఉంది. ఫోన్ శక్తివంతమైన 100డబ్ల్యు సూపర్ వూక్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడుతే..ఇది 50 ఎంపి ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. దానితో పాటు..8 ఎంపి అల్ట్రా-వైడ్ సెన్సార్, 2 ఎంపి మాక్రో కెమెరా సెన్సార్ అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News