Sunday, January 19, 2025

అమెజాన్ సమ్మర్ సేల్.. ఈ స్మార్ట్ ఫోన్ల పై భారీ తగ్గింపులు..!

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం అమెజాన్‌లో సమ్మర్ సేల్ కొనసాగుతోంది. ఇప్పట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికీ ఇదొక మంచి అవకాశం. అమెజాన్ లో ఆపిల్, వన్‌ప్లస్, శాంసంగ్ ఇక మరెన్నో స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌తో సహా గొప్ప డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ సేల్‌లో లభించే కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ గురుంచి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఐఫోన్ 13

ఈ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినాతో అమర్చబడింది. ఐఫోన్ 13 లో A15 బయోనిక్ చిప్ ఉంది. దీంతో ఇది చాలా వేగంగా పని చేస్తుంది. ప్రస్తుతం అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఐఫోన్ 13 ధర రూ.48,999గా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

iQOO Z9X

ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల డిస్‌ప్లే, అద్భుతమైన ఫోటోలు తీయడానికి 50 ఎంపీ కెమెరా, గొప్ప పనితీరు కోసం..స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ ఉంది. iQOO Z9x దాని విభాగంలో అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్. అమెజాన్‌లో iQOO Z9X ధర దాదాపు రూ. 12,999 గా ఉంది. ఇందులో రూ. 1,000 వరకు తక్షణ బ్యాంక్ తగ్గింపు కూడా ఉంది. దీనితో ఈ ఫోన్‌ను మరింత చౌకగా పొందవచ్చు.

OnePlus 12R 5G

OnePlus 12R 5G ఒక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ పనితీరు కోసం..Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఉంది. అంతేకాకుండా 4500 nits బ్రైట్‌నెస్, ఫోన్ ఎక్కువ రోజులు యూజ్ చేయడానికి 5500 mAh బ్యాటరీ కలిగి ఉంది. ఇలా అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం Amazonలో OnePlus 12R ధర రూ.39,999 గా ఉంది.

OnePlus Nord CE 4

ఈ స్మార్ట్‌ఫోన్‌ను శక్తివంతం చేయడానికి..కంపెనీ దీనిలో Qualcomm Snapdragon 7th Gen ప్రాసెసర్‌ను అందించింది. అలాగే అద్భుతమైన ఫోటోలు తీయడానికి ఫోన్ లో Sony LYT – 600 50MP కెమెరాఉంది. 100W SuperVOOC ఛార్జింగ్‌తో సహా అనేక శక్తివంతమైన లక్షణాలను కలిగి ఉంది. ఇక ధర చూస్తే..అమెజాన్‌ సమ్మర్ సేల్ లో OnePlus Nord CE 4 రూ. 24,999 గా ఉంది. అంతేకాకుండా ఇందులో రూ. 1,500 వరకు తక్షణ బ్యాంక్ తగ్గింపు కూడా ఉంది.

Samsung Galaxy M15 5G

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ట్రిపుల్ కెమెరాఉంది. పని తీరు కోసం..MediaTek Dimension 6100 ఉంది. ఈ ఫోన్ లో AMOLED డిస్‌ప్లే అమర్చారు. అంతేకాకుండా అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి. Amazonలో Samsung Galaxy M15 5G ధర రూ.12,999 గా ఉంది.

Also Read:

పవన్ గెలువాలని… మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News