Thursday, February 27, 2025

ఇనుప ఖనిజం వల్లనే అంగారక గ్రహం ఎరుపెక్కింది

- Advertisement -
- Advertisement -

మార్స్ అంటే అంగారక గ్రహం. ఇది అరుణ వర్ణంగా అంటే ఎరుపురంగులో ఎందుకు కనిపిస్తుంది? ఇనుము ఖనిజ లక్షణాల వల్లనే గ్రహం ఎరుపురంగులో ఉంటుందని పరిశోధకులు గత కొన్నేళ్లుగా చెబుతున్నారు. ఇనుప ఖనిజ ధూళి రేణువులు ఖనిజంగా రూపం చెందాలంటే చల్లని నీళ్లు అవసరం అని, గతంలో ఈ గ్రహం నివాసయోగ్యంగా ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫెర్రీ హైడ్రైట్ వంటి ఐరన్ ఆక్సైడ్స్‌తోసహా వివిధ రకాల ఖనిజాల మిశ్రమం వల్లనే గ్రహం ఎరుపురంగుగా మారిందని నిర్ధారిస్తున్నారు. ఎరుపురంగుకు కారణం ఫెర్రీహైడ్రైట్ అని మొట్టమొదటిసారి తాము చెప్పలేదని, కానీ అధ్యయన డేటా ఉపయోగించి ప్రయోగశాలలో అత్యంత ఆధునిక పద్ధతుల్లో అంగారక గ్రహ ధూళి కణాలను తయారు చేయగలిగామని అమెరికా లోని బ్రౌన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఆడమ్ వాలంటైనస్ వెల్లడించారు.

ఈ విశ్లేషణ ప్రకారం అంగారక దుమ్ములో , రాళ్ల నిర్మాణంలో ఇలా ప్రతిచోటా ఫెర్రీహైడ్రైట్ నిండి ఉంటున్నట్టు నమ్ముతున్నామన్నారు. ఇదివరకు హెమటైట్ వంటి ఖనిజాల వల్ల ఎరుపురంగు కలిగిందని అనుకునేవారని, కానీ అతితక్కువ ఉష్ణోగ్రతల్లో చల్లని నీటివల్ల ఫెర్రీహైడ్రైట్ ఏర్పడుతుందని తెలుస్తోందని చెప్పారు. ఈ పరిశోధనల కారణంగా అంగారక గ్రహం ద్రవ జలాన్ని పొందగలిగే వాతావరణం ఉండేదని స్పష్టమవుతోందని తెలిపారు. అంగారక గ్రహ వాతావరణం తడి నుంచి పొడి వాతావరణానికి కొన్ని లక్షల ఏళ్ల క్రితం సౌర గాలుల వల్ల మారిందని పేర్కొన్నారు. సౌరగాలుల నుంచి కాపాడుకోలేని బలహీన అయస్కాంత క్షేత్రం ఉండడంతో గ్రహం పొడిబారడమే కాకుండా చల్లగా ఉండిపోయిందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News