గోషామహల్: మలి దశ తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో లక్షలాది మందిలో చైతన్యం రలిగించిన దివంగత సాయిచంద్ కాం స్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన భార్య రజనికి అలంపూర్ నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించా లని జాతీయ మాలల క్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల సుధీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఐక్యవే దిక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్ సాయిచంద్ హఠాన్మరణం మాల జాతికి తీరని లోటన్నారు. ఆ యన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు విశేషమైన కృషి చేసిన సాయిచంద్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని, అండగా నిలవాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దళిత ప్రజా ప్రతినిధుల అంత్యక్రియల నిర్వహణ లో వివక్షను ప్రదర్శిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణకు ఎలాంటి సంబంధం లేని ఆంధ్రా సినీ నటులు మరణిస్తే యుద్ద ప్రా తిపదికన అథికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అధికార పా ర్టీకి చెందిన దళిత ప్రజా ప్రతినిధు లు మరణించిన సమయంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకుండా దళిత జాతిని అవమానిస్తుందని ఆరోపించారు. సచివాల యానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి, సచివాలయం ఎదుట 125 అడుగుల విగ్రహం నిర్మించినంత మాత్రాన దళిత జాతిని ఉద్దరించినట్లు కాదని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించాలని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వ దళిత ప్రజా ప్రతినిధుల అంత్యక్రియల నిర్వహణలో వివక్షను మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి మాలలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు.