హైదరాబాద్: తెలంగాణకు శిబుసోరెన్ సహకరించారని సిఎం కెసిఆర్ అన్నారు. జార్ఖండ్ సిఎంతో జాతీయ రాజకీయాలపై చర్చించామని సిఎం తెలిపారు. త్వరలోనే అందర్నీ కలుస్తామని ఆయన పేర్కొన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త అజెండా కావాలని సిఎం ఆకాంక్షించారు. ఇప్పుడు ఏ ఫ్రంట్ లేదు… ఏదైనా ఉంటే చెబుతామన్నారు. దేశం బాగు కోసమే తమ ప్రణాళికని వెల్లడించారు. థర్డ్ ఫ్రంట్.. ఫోర్త్ ఫ్రంట్ అంటున్నారు.. ఇప్పటివరకు ఏ ఫ్రంట్ ఏర్పాటు కాలేదన్నారు. ఏం ఏర్పాటవుతుందో భవిష్యత్తులో తేలుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒకటి మాత్రం నిజం… 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో జరగాల్సిన అభివృద్ధి మాత్రం జరగలేదని సిఎం కెసిఆర్ విమర్శించారు. భారతదేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లడానికి ప్రయత్నం అవసరం అన్నారు. దేశం కోసం మంచి జరగాలన్నదే తమ ప్రయత్నం అన్నారు. అందరం కలిసి చర్చించి ఫ్రంట్ ఏర్పాటు చేయాలో ఇంకేమైనా చేయాలో భవిష్యత్ నిర్ణయం తీసుకుంటామననారు.
జాతీయ రాజకీయాలపై చర్చించాం: సిఎం కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -