- Advertisement -
న్యూఢిల్లీ : స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మధ్య చర్చలు జరిగాయి. ఒప్పందం విషయంలో విభేదాల తొలిగింపు, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కుదుర్చుకుంటామనే ఆశాభావం ఇరువురు నేతలు వ్యక్తపర్చారు. ఇండో యుకె సంబంధిత ఎఫ్‌టిఎ విషయంలో ఇప్పటి పురోగతిని ఇరువురు నేతలు ఈ నేపథ్యంలో సమీక్షించారు. ఇప్పటికీ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదని, తొందరగా వీటిని సవ్యంగా పరిష్కరించుకోవల్సి ఉందని అభిప్రాయానికి వచ్చారు.
జి20 సారధ్య బాధ్యతలు తీసుకున్న భారత్‌కు పలు దశల్లో బ్రిటన్ సహకరించి నందుకు ఈ నేపథ్యంలో సునాక్‌కు ప్రధాని మోడీ పలుసార్లు థ్యాంక్స్ చెప్పారు. పలు అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలను ఇరువురు నేతలు ఈ నేపథ్యంలో సమీక్షించారు.
- Advertisement -