హైదరాబాద్ : అన్యాక్రాంతానికి గురైన దళితుల అసైన్డ్, ఇనాం, బంచరాయి, ఇతర భూములపై అసెంబ్లీ లో చర్చ జరగాలని తెలంగాణ మాల మహానాడు డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి సంఘ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ వేల ఎకరాలు దళితులనుండి గుంజుకున్నారని ఆరోపించారు. వాటిపై న్యాయ విచారణ జరిపి తిరిగి వారికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ చట్టం నిధులు ఎక్కడికెళ్తున్నాయో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు అందజేయాలని, దళితుల సమస్యలపై త్వరలో వేలాది మందితో ఛలో హైదరాబాద్ కు పిలుపునివ్వనున్నామన్నారు. ఈకార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదండపురం సత్యనారాయణ,జై భీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర కన్వీనర్ అసాది పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసూరి మల్లిఖార్జున్, రాష్ట్ర కార్యదర్శి సుధీర్, పలిగిరి కనకరాజు,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
దళిత భూముల అన్యాక్రాంతం పై అసెంబ్లీ లో చర్చ జరగాలి : మాలమహానాడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -