Wednesday, January 22, 2025

అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల హామీలపై చర్చేది? : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చ జరగలేదని పిసిసి అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి సభను ఎలా నడపాలో ఇంకా తెలియడం లేదని ఆయనన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ని బీఆర్‌ఎస్ నాయకులు కామెడీ సినిమాను తలపింపచేశారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశాలు బిఆర్‌ఎస్ పార్టీ సమావేశాలను తల పించాయన్నారు. ఎన్నికల హామీలు ఎంతవరకు అమలు అయ్యాయో చర్చ జరుగుతుందని ప్రజలు ఆశించారని కాని చివరి అసెంబ్లీ సమావేశాల్లో అది జరగలేదన్నారు.

కేవలం రేవంత్ రెడ్డి పై విమర్శలకు పరిమితం చేశారని పేర్కొన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు ఇష్యూలో రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలను ఎందుకు సమాధానం చెప్పలేదని అయోధ్యరెడ్డి ప్రశ్నించారు. కొత్తగా కట్టిన సెక్రటేరియట్‌లో కూడా వర్షపు నీళ్ళు నిలబడుతున్నాయన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారంతా టిడిపి నాయకులేనని, తెలంగాణ ద్రోహులను పక్కన కూర్చోబెట్టుకుని ఇంకా తెలంగాణ సెంటిమెంట్ తో లబ్ది పొందాలని చూస్తే ప్రజలు హర్షించరని అన్నారు.

రాహుల్ కు ఆదరణ చూసి ఓర్వలేకపోతున్న బిజెపి : బొజ్జ సంద్యారెడ్డి రాహుల్ గాంధీ కి ప్రజల్లో వచ్చిన ఆదరణ చూసి బిజెపి ఓర్వలేక పోతోందని పిసిసి అధికార ప్రతినిధి బొజ్జ సంధ్యారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని చూస్తే బిజెపి నాయకులకు భయం పట్టుకుందన్నారు. గాంధీ కుటుంబ ఎప్పుడు ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు, రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో రీ ఎంట్రీ ప్రజాస్వామ్య జయమని కాంగ్రెస్ ఎప్పుడు అధికారం కోసం పాకులాడదని అన్నారు.
నేడు తండాల్లో బస : మహేష్ కుమార్ గౌడ్
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తండాల్లో బస చేయాలని కాంగ్రెస్ నాయకుల నిర్ణయించారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఎఐసిసి నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు బుధవారం తండాల్లో బసచేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ ప్రజలతో వాళ్ళ కష్టసుఖాలు చర్చించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని కులాలు, అన్ని మతాలు సమానమని, ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారమే కాంగ్రెస్ ముందుకు పోతోందన్నారు.
ఆదివాసీలకు అండగా కాంగ్రెస్ : బెల్లయ్య నాయక్
బిజెపి అధికారంలోకి వచ్చాక ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయిందని బెల్లయ్య నాయక్ అన్నారు. ఆదివాసీలను భయపెట్టి ఊర్లకు నిప్పు పెట్టాలని బిజెపి చూస్తోందన్నారు. ముస్లింల లాగా ఆదివాసీలపై ఉక్కుపాదం మోపడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆదివాసీలకు కాంగ్రెస్ గతంలో ఏం చేసింది? భవిష్యత్తులో ఏం చేస్తుందో చెప్తామన్నారు. బుధవారం తండాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకుల ప్రసంగాలతో పాటు ఆదివాసీలకు ప్రతిజ్ఞ చేసే కార్యక్రమం ఉంటుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News