Thursday, January 23, 2025

విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ జరగాలి: ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్

- Advertisement -
- Advertisement -

హైదాదరాబాద్: విద్యుత్ బిల్లుపై ఎటువంటి చర్చ జరంగకుండా పార్లమెంట్‌లో ప్రవేశట్టవదని ఆల్ ఇండియా ఫెడరేషన్ నాయకులు శైలేంద్ర దూబే ,రత్నాకర్‌రావు డిమాండ్ చేశారు. కర్నాటక ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బిల్లును ఆమోదించే ముందు పవర్ ఇంజినీర్లు ,మరియు సంస్థలతో చర్చలు జరపకుండా బిల్లును ప్రవేశపెడితే తాము ఎటువంటి ఆందోళనలైనా చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.

రైతులు, భాగస్వాములందరితో సవివరంగా చర్చలు జరపకుండా విద్యుత్ (సవరణ) బిల్లు 2022ను పార్లమెంటులో పెట్టబోమని హామీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది యునైటెడ్ కిసాన్ మోర్చాకు లేఖ రాసిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇంత వరకు విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగుల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదని వారు విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ ఈ ఏకపక్ష చర్యలు ఎట్టిపరిస్థితుల్లో సహిచేది లేదని వారు హెచ్చరించారు. విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదిస్తే దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులతో పాటు, వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తారన్నారు. బిల్లు ప్రకారం సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలు రద్దు కావడతోం విద్యుత్ వినియోగదారులపై చార్జీల భారం పడుతుంది తద్వారా వారు తీవ్రంగా నష్టపోతారు. అంతే కాకుండా 7.5 హార్స్ పవర్ తో కూడిన పంపింగ్ సెట్ ను 06 గంటలు మాత్రమే నడిపితే రైతులకు నెలకు రూ.10 వేల నుంచి 12 వేల వరకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది దీంతో రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది.ఈ బిల్లు సామాన్య ప్రజానీకానికి గానీ, ఉద్యోగులకు గానీ ప్రయోజనం ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావ్యతిరేక విద్యుత్ (సవరణ) బిల్లు 2022ను పార్లమెంట్‌లో ఏకపక్షంగా ఆమోదించే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులతో పాటు, వినియోగదారులు, రైతులు ఆందోళన చేస్తారని వారు హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News