Sunday, January 19, 2025

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఝరాసంగం : మామిడి తోటలో నష్టం వచ్చిందని వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల మండలం పరిధిలోని ఎల్గోయి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొట్టి పల్లి గ్రామానికి చెందిన మసుల్ దార్ జాఫర్ (38) గత కొన్ని సంవత్సరాల నుంచి మామిడి తోటలను పట్టుకొని (లీజుకు తీసుకొని) పండ్ల వ్యాపారం చేస్తూ జీవించేవారు.

ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మామిడి తోటలను కౌలుకు తీసుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగకపోవడంతో తీవ్రంగా నష్టపోవడంతో మనస్థాపానికి గురైన జాఫర్ సోమవారం ఉదయం మామిడి తోటకు వెళ్ళొస్తానని చెప్పి ఎల్గోయి గ్రామ శివారులోని నిమ్జ్ పరిధిలోగల వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నట్లు భార్య షహీన్ సుల్తానా ఫిర్యాదుతో ఝరాసంగం ఎస్సై రాజేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News