Tuesday, December 17, 2024

ఉద్యోగం కోసం ఆశపడి.. రూ.25 లక్షలు పోగొట్టుకున్న దిశా పటానీ తండ్రి

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తండ్రికి కేటుగాళ్లు షాకిచ్చారు. ఉద్యోగం కోసం ఆశపడి.. రూ.25 లక్షలు పోగొట్టుకున్నాడు. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ అయిన దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి కామన్ ఫ్రెండ్స్ ద్వారా దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తులు పరిచయమయ్యారు. తర్వాత ఆయనకు ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిషన్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ లేదా ఉన్నతస్థాయి పదవిని ఇప్పిస్తామంటూ జగదీశ్ సింగ్ పటానీ దగ్గర రూ.25 లక్షలు నొక్కేశారు. ఆ తర్వాత నెలలు గడుస్తున్నా వారు స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన జగదీశ్ సింగ్ పటానీ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News