Friday, December 27, 2024

యువతిని వేధించిన కానిస్టేబుల్ సర్వీస్ నుంచి తొలగింపు

- Advertisement -
- Advertisement -

Dismissal constable from service over harassing woman

మనతెలంగాణ, సిటిబ్యూరో: ప్రేమికులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కానిస్టేబుల్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆకాష్ భట్ ఈ నెల 15వ తేదీన పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. బోయిన్‌పల్లి డైయిరీ మార్కెట్ వద్ద ప్రేమికులు ప్రవీణ్‌కుమార్ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్నాడు.

ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అదే సమయంలో అక్కడికి వెళ్లిన ఆకాష్ భట్ వారి వద్దకు వెళ్లి బెదిరించి రూ.15,000 బలవంతంగా తీసుకున్నాడు. వారి మొబైల్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత కొద్ది రోజుల నుంచి కానిస్టేబుల్ ఆకాష్, బాధితుడు ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో బాధితుడు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌కు రిపోర్టు ఇచ్చారు. దాని ఆధారంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కానిస్టేబుల్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News