- Advertisement -
శ్రీనగర్ : ఉగ్రవాదంపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం మరోసారి కొరడా ఝళిపించింది. ఉగ్రవాద సంబంధాలున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించింది. ఈ ఉద్యోగులు నార్కోసిండికేట్ నడుపుతూ ఉగ్రదాడులు జరిపేందుకు నిర్దిష్ట ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారే కారణంగా వీరిని సర్వీస్ నుంచి తప్పించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఉద్వాసనకు గురైన ఉద్యోగుల్లో జమ్ముకశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ తన్వీర్ సలీమ్ డర్, బారాముల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మేనేజర్ అఫఖ్ అహ్మద్ వలి, బీడీఓ ఆఫీస్ ప్లాంటేషన్ సూపర్‌వైజర్ ఇఫ్తిఖర్ ఆండ్రబి, జల్‌శక్తి శాఖకు చెందిన ఐర్షఆద్ అహ్మద్ ఖాన్, పిహెచ్‌ఈ సబ్‌డివిజన్ అసిస్టెంట్ లైన్‌మన్ అబ్దుల్ మొమిన్ షీర్ ఉన్నారు.
- Advertisement -