Tuesday, November 5, 2024

హిజ్బుల్ చీఫ్ కుమారుడు సహా నలుగురు ఉద్యోగుల తొలగింపు

- Advertisement -
- Advertisement -

Dismissal of four employees including son of Hizbul chief

శ్రీనగర్ : ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసుకు సంబంధించి నలుగురు ఉగ్యోగులను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించింది. దర్యాప్తు లేకుండానే ఉద్యోగులను తొలగించే అధికారం రాజ్యాంగం లోని 311 ఆర్టికల్ కల్పిస్తుంది. ఈమేరకు ఈ నలుగురిని సర్వీస్ నుంచి తొలగించారు. వీరిలో టెర్రర్ ఫండింగ్ నిందితుడు బిట్టా కరాటే భార్య అస్సాబా అర్జూమండ్ ఖాన్, జేకేఎల్‌ఎఫ్ టాప్ టెర్రరిస్టుల్లో ఒకరైన ఫరూఖ్ అహ్మద్ డర్ అలియాస్ బిట్టా కరాటే 2011 బ్యాచ్ జేకేఎఎస్ ఆఫీసర్. నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యిద్ సలావుద్దీన్ కుమారుడు సయ్యిద్ అబ్దుల్ ముయీద్ కూడా ఉన్నారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ లోని సమాచార, సాంకేతిక విభాగం మేనేజర్‌గా ముయీద్ ఉన్నాడు. ఫరూక్ అహ్మద్‌డర్ అలియాస్ బిట్టా కరాటే ప్రస్తుతం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆయన భార్య అస్సాబా ఉల్‌అర్జమాండ్ ఖాన్ జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అఫీసర్‌గా రూరల్ డెవలప్‌డైరెక్టరేట్‌లో ఉన్నారు. సర్వీస్ నుంచి ప్రభుత్వం తొలగించిన మిగతా ఇద్దరిలో సైంటిస్ట్ డాక్టర్ ముహీద్ అహ్మద్ భట్, కశ్మీర్ యూనివర్శిటీ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మజిద్ హుస్సేన్ ఖాదిరి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News