Monday, December 23, 2024

సీతారాంపురం సర్పంచ్ విధుల నుంచి తొలగింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ములకలపల్లి : మండల పరిధిలోని సీతారాంపురం గ్రామ పంచాయితీ సర్పంచ్ సున్నం సుసీలను సర్పంచ్ విధుల నుండి జిల్లా కలెక్టర్ అనుదీప్ తొలగిస్తూ మండల పరిషత్ అబివృద్ది అధికారికి ఉత్తర్వులను మంగళవారం పంపించారు. దీనికి సంబందించిన వివరాలను మండల పరిషత్ అబివృద్ది అధికారి చిన్న నాగేశ్వరరావు పత్రికలకు విడుదల చేసినారు. సున్నం సుసీల తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, బందుప్రీతికి పాల్పడుతూ, శాంతి భధ్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఆ ఉత్తర్వులో పేర్కోన్నారు.

వ్యక్తి గత వివాదాలకు, తగాదాలకు తనకు ఎలాంటి సంబందం లేదని తానంటే నచ్చనివారు తనపై అసత్య ఆరోపనలు చేస్తూ తనను సర్పంచ్ పదవి నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని సున్నం సుసీల అధికారులకు సంజాయిషి ఇచ్చుకున్నారు. సుసీల ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని అధికారులు ఆమెను తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం 2018 సెక్షన్ 37(1)లోని 2,3,5, ప్రకారం సర్పంచ్ విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారి చేసినారు. ఇట్టి ఉత్తర్వులపై ఏమైన అప్పీలు చేయదలుసుకున్నచో తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 141 ప్రకారం గ్రామ పంచాయితీ ట్రిబ్యునల్‌నందు 30 దినములలోగా అప్పీలు చేసుకోవచ్చునని ఆ ఉత్తర్వులో అధికారులు పేర్కోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News