Sunday, December 22, 2024

పవర్ కమిషన్ సబబే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు హై కోర్టులో చుక్కెదురైంది. జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమి షన్‌ను రద్దు చేయాలంటూ కెసిఆర్ పెట్టుకున్న రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. కెసిఆర్‌కు జారీ చేసిన నోటీసుల్లో కమిషన్ ఎక్కడా కూడా చ ట్టాన్ని ఉల్లంఘించలేదని పేర్కొంది. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహిం చారని అనుమానించడం కాకుండా, దానికి తగిన ఆధారాలను చూపాలని సూచిం చింది. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి, భ ద్రాద్రి ధర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో అక్రమాలు జరిగాయంటూ వాటిని నిగ్గు తేల్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చే సింది. విచారణ చేపట్టిన కమిషన్ తమ ఎదుట విచార ణకు హాజరు కావాలని కెసిఆర్ ను ఆదేశించింది.

అయితే, ఆ సమయంలో తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, మ రోమారు వస్తానని కమి షన్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత విచారణకు హాజరు కాకపోగా విచారణ కమిషన్ తీరును తప్పుబడుతూ బహిరంగ లేఖ రాశారు. ఆ తర్వాత అసలు కమిషన్ ఏర్పాటే చెల్లుబాటు కాదని, దానిని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ దురుద్దేశపూర్వకంగా, ఏకపక్షంగా విచారిస్తోందని, విచారణ పూర్తికాకుండానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని చెప్పిందని ఆరోపించారు. కెసిఆర్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కెసిఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ మేరకే కమిషన్‌ను ఏర్పాటు చేశామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.

జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. ఏజీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. వాదనల అనంతరం తీర్పును రిజ్వర్వ్ చేసిన ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనతో విభేదించిన న్యాయస్థానం కెసిఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News