Thursday, January 23, 2025

విరాట్‌లో చేవ తగ్గలేదు: దినేశ్ కార్తీక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లిలో చేవ తగ్గలేదని భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో చిరస్మరణీయ సెంచరీతో కోహ్లి మరోసారి సత్తా చాటాడన్నాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ సెంచరీ దోహదం చేస్తుందనడంలో సందేహం లేదన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఆకలిగొన్న పులిలా ఆడాడని ప్రశంసించాడు. కోహ్లి ఇదే జోరును కొనసాగిస్తే క్రికెట్‌లోని చాలా రికార్డులను తన పేరిట లిఖించుకోవడం ఖాయమన్నాడు. తొలి టెస్టులో కూడా కోహ్లి మెరుగైన బ్యాటింగ్ చేసిన విషయాన్ని కార్తీక్ గుర్తు చేశాడు. అరుదైన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం సాధించి దీన్ని కోహ్లి చిరస్మరణీయంగా మలుచుకున్నాడన్నాడు. ప్రపంచ క్రికెట్‌లోనే కోహ్లి అత్యంత అరుదైన బ్యాటర్ అని కొనియాడాడు. మరోవైపు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై కూడా దినేశ్ ప్రశంసలు కురిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News