- Advertisement -
న్యూయార్క్ : అమెరికాకు చెందిన ఎంటర్‌టైన్మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ ఇప్పుడు మూడో రౌండ్ తొలగింపులను ప్రారంభించింది. తాజా రౌండ్‌లో కంపెనీ 2,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. అయితే ఏయే విభాగాల్లో ఆ సంస్థ ఉద్యోగులపై వేటు వేస్తుందో ఇంకా తెలియరాలేదు. నెల రోజుల క్రితం డిస్నీ రెండో రౌండ్‌లో 4,000 మంది ఉద్యోగుల తొలగించింది. మొదటి రౌండ్‌లో 7000 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ ప్రకటించింది. 2022 అక్టోబర్ 1 నాటికి డిస్నీలో మొత్తం 2.20 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ ఈ తొలగింపు ద్వారా 5.5 బిలియన్ డాలర్లు (రూ. 45,547 కోట్ల) ఆదా చేస్తోంది.
- Advertisement -