Friday, January 3, 2025

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. మూడు నెలల పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితం..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్, ఐడియా ఇటీవల రీఛార్జ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో అనేక యూజర్లు తమ సిమ్ ను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ లో సరసమైన , చౌకైన రీఛార్జిలు ఉండటం. అయితే, ఇప్పుడు జియో కంపెనీ తమ యూజర్లను ఆకర్షించేందుకు అనేక ప్లాన్ లను తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్. ఒకవేళ మీరు డిస్నీ+హాట్‌స్టార్‌ను ఉచితంగా యాక్సెస్ పొందాలనుకుంటే ఈ ప్లాన్ మీకు ఉత్తమం అని చెప్పవచ్చు. కంపెనీ ఇందులో డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కస్టమర్‌లకు 3 నెలల పాటు ఉచితంగా అందిస్తుంది. అంతేకాకుండా.. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు జియో టీవీ, జియో సినిమా,జియో క్లౌడ్ ను కూడా పూర్తిగా ఉచితంగా పొందొచ్చు.

ఇకపోతే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో కస్టమర్‌లకు 64 రోజుల చెల్లుబాటు వస్తుంది. ప్రతిరోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, ప్రతిరోజూ 100SMS పొందొచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు మొత్తం చెల్లుబాటులో మొత్తం 168GB డేటాను పొందుతారు. ఒకవేళ మీ ఫోన్ 5జి అయితే అపరిమిత 5Gకి యాక్సెస్ పొందొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News