Monday, December 23, 2024

రిలయన్స్‌తో డిస్నీ విలీనం ఖరారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య విలీనం కొలిక్కి వస్తోంది. క్యాష్, స్టాక్ ఒప్పందం ద్వారా భారత్ మీడియా ఆపరేషన్ల విలీనానికి రెండు కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సోమవారం నాడు ఒక ప్రకటన చేయవచ్చని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

బిలియనీర్ ముకేశ్ అంబాని సంస్థ అయిన రిలయన్స్‌కు చెందిన బ్రాడ్‌క్యాస్ట్ వెంచర్ వయాకామ్18 ఆధ్వర్యంలో జియోసినిమా డిస్నీ ఇండియా, ఇతర ప్లాట్‌ఫామ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టౌర్నమెంట్‌ను అందించడం ద్వారా అంబానీ వ్యూహాత్మకంగా ప్లాట్‌ఫామ్‌ను ప్రోత్సహించగా, గతంలో డిస్నీ దీని డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఒప్పందం జరిగితే రిలయన్స్ ఈ సంస్థలో 51 శాతం వాటా కోసం నిధులను వెచ్చించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News